రూ.69,999కే ఓలా ఎస్‌1ఎక్స్‌ ఇవి

బెంగళూరు : ప్రముఖ ద్విచక్ర ఇవి కంపెనీ ఒలా ఎలక్ట్రాక్‌ తన ఎస్‌1ఎక్స్‌ను రూ.70వేల లోపే అందిస్తున్నట్లు ప్రకటించింది. 2కిలోవాట్‌ వేరియంట్‌ ఎక్స్‌షోరూం ధరను రూ.69,999గా, 4కెవాట్‌ ధరను రూ.99,999కు తగ్గించినట్లు సోమవారం పేర్కొంది. ఇవి జూన్‌ 4నుంచి లభిస్తాయని పేర్కొంది. దాదాపు రూ.10వేల వరకు తగ్గించినట్లు తెలుస్తోంది. కాగా 8 సంవత్సరాలు లేదా 80వేల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీని కల్పిస్తున్నట్లు పేర్కొంది.

Spread the love