అధిక ఫీజులతో జనాలను దోచేస్తున్నారు..

నవతెలంగాణ – బొమ్మలరామారం 

కార్పొరేట్ విద్యాసంస్థలు సీబీఎస్సీ కార్పొరేట్ విద్యా సంస్థల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని, జాతీయ బంజారా మిషన్ రాష్ట్ర అధ్యక్షుల కృష్ణ నాయక్  జిల్లా అధ్యక్షులు కాట్రోత్ మురళి నాయక్ అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్య నియంత్రణ ప్రవేట్ లెక్చర ర్ ఆర్గనైజేషన్ వేతనాల కమిటీ వేసి శ్రమ దోపిడిని అరికట్టడంపై ప్రాథమిక విద్య హక్కు చట్టంపాటించాలని అన్నారు. ఇష్ట అనుసరంగా అధిక ఫీజులు దోచుకుంటూ జనాలను దోచేస్తున్నారని దీనిపై ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న రోజుల్లో న్యాయం జరిగే పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవి రాజు రాథోడ్, భరత్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love