బోర్గం లక్ష్మీనరసింహస్వామి మూడవ వార్షికోత్సవం

నవతెలంగాణ- మోపాల్
మోపాల్ మండలం బోర్గం(పి) గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వేకువ జామున నుండే గ్రామ ఈగ పరివారం ఆధ్వర్యంలో స్వామికి అభిషేకం  పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.అలాగే ఈగ పరివారం ఆధ్వర్యంలో అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉప అధ్యక్షులుగా ఎన్నుకోబడిన ఈగ సంజీవరెడ్డిని ఘనంగా  సన్మానించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి మూడవ వార్షికోత్సవ సందర్భంగా ఈగ పరివారం ఆధ్వర్యంలో స్వామికి అర్చనా మరియు అభిషేకాలు చేయడం జరిగిందని కావున భగవంతుడు  మరియు గ్రామస్తులందరినీ ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండే విధంగా చూడాలని అలాగే గ్రామంలో పాడిపంటలు అభివృద్ధి చెందుతూ గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండాలని అన్నారు. అలాగే సంజీవరెడ్డి దంపతులు స్వామి వారికీ పూజలు నిరవ్వహించి బ్రాహ్మణు లకు నూతన వస్త్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఈగ రమేష్ రెడ్డి రజిత దంపతులు, ఈగ గంగా సాగర, ఈగ చిన్నారెడ్డి, గోపాల్ రెడ్డి, ఈగ రవీందర్ రెడ్డి, ఈగ గంగారెడ్డి,  పరివారం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love