Friday, July 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈ స్పందన అద్భుతం

ఈ స్పందన అద్భుతం

- Advertisement -

దశాబ్దానికి పైగా కాలంగా శరత్ చంద్ర నాయుడు తెలుగు సినీ పరిశ్రమలోని అతిపెద్ద చిత్రాల మార్కెటింగ్, డిజిటల్ ప్రచార కార్యక్రమాల వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు నిర్మాతగా సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. ఆయన తొలి నిర్మాణమైన ‘గుర్తు కొస్తున్నాయి’ వెబ్‌సీరిస్‌ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది. ఈ వెబ్‌సీరిస్‌కు ప్రేక్షకుల నుంచి అనూ హ్యమైన స్పందన వస్తోంది. నఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నా ప్రయాణం నా ఇన్‌స్టాగ్రామ్ పోడ్‌కాస్ట్ పేజ్ ‘రేలంగి మావయ్య’తో ప్రారంభమైంది. అందులో నేను 90వ దశకానికి చెందిన జ్ఞాపకాలను నా స్వరంలో పంచుకుంటుంటాను. కాలక్రమేణా ఆ పేజ్‌కు ప్రేక్షకుల నుంచి అపారమైన ఆదరణ లభించింది. ఆ కాలంలో పెరిగిన వారితో బలమైన అనుబంధం ఏర్పడింది. ఆ కంటెం ట్‌ను చూసిన తర్వాత ఈటీవీ విన్‌కు చెందిన సాయి, నితిన్ ఆ భావోద్వే గాలను వెబ్ సిరీస్‌గా మలిచే అవకాశం ఉందని భావించారు. అలా ‘గుర్తుకొస్తున్నాయి’ పుట్టు కొచ్చింది. ఈ మైలురాయిని మరింత ప్రత్యేకంగా నిలిపింది అల్లు అర్జున్ నుంచి లభించిన ప్రోత్సాహం. నా కొత్త ప్రయాణంపై ఆనందం వ్యక్తం చేసిన ఆయన నన్ను వ్యక్తిగతంగా అభినందించారు. ఎన్నాళ్లుగానో తనతో కలిసి పనిచేసిన టీమ్ సభ్యుల్లో ఒకరు నిర్మాతగా తొలి అడుగు వేయడంపై తన సంతో షాన్ని వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని అల్లు అర్జున్‌ ఎంకరేజ్ చేశారు. వారిలో నేనూ ఉండటం ఆనందంగా ఉంది` అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -