నవతెలంగాణ-ఖానాపూర్
మండలంలోని పాత ఎల్లాపూర్ జడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు రూ. పదివేల విలువైన టైలు, బెల్టులు ఉచితంగా అందజేశారు. సామ వంశీ, సామ లక్ష్మీనారాయణ, సామశంకర్ వారి తాతలు దివంగత సామలింగయ్య, సామ బుచ్చయ్య, సామ రాజయ్యల జ్ఞాపకార్థం పాఠశాలలోని 120 మంది విద్యార్థులకు సామాగ్రి అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం అసూరి రమాదేవి, రాజ గంగు ఉన్నారు.