అన్ని చెక్ పోస్టులో గట్టి నిఘా

– స్ట్రాంగ్ రూమ్ లో సీజింగ్ నగదు, బంగారం, వెండి ఇతర వస్తువులు
– జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో సీజింగ్ ను పకడ్బందీగా చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.అక్రమ నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర వస్తువులు పట్టుకొని బాధితులు ఆధారాలు గ్రీవెన్స్ కమిటీ కి అందచేస్తే పరిశీలన తదుపరి 24 గంటల లోపు అందచేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 32 బృందాలు విధుల్లో ఉన్నారని ,జిల్లా అంతటా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్  అమలులో ఉందని ప్రజలు పూర్తిగా సహకరించాలని అన్నారు. జిల్లాలో  శనివారం వరకు నగదు రూ.143.85 లక్షలు, మద్యం 11389.75  లీటర్ల విలువ రూ. 46.36  లక్షలు, 12 వాహనాల విలువ రూ.3.39 లక్షలు, బంగారం, ఇతర ఆభరణాల విలువ రూ. 113.63 లక్షలు ఇతర వస్తువుల విలువ రూ. 72.07 లక్షలు మొత్తం 379.30 లక్షలు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన కంట్రొల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు.
Spread the love