బీఆర్ఎస్ కి తిమ్మాపూర్ బుడగజంఘం మద్దతు 

– ఎంపీ ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం పని చేద్దాం 
నవతెలంగాణ- దుబ్బాక రూరల్ : మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరం ఆయన గెలుపు కోసం పని చేద్దామని దుబ్బాక మండల ఎన్నికల పరిశీలకులు ఎల్లు రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపుర్ గ్రామానికి చెందిన బుడగజంఘం సంఘం సభ్యులంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి   కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దత్తు తెలుపుతూ  తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల మంజుల బాలనర్సగౌడ్, మాజీ ఏఎంసి  వైస్ చైర్మన్ పండరి రాజా లక్ష్మణ్ రావు, ఏమ్మర్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దప్పు శివరాజ్ మాదిగ, బూత్ అధ్యక్షులు , మూర్తి కరుణాకర్ రెడ్డి తదితరులున్నారు.
Spread the love