టీఎన్జీవో డైరీ, క్యాలెండర్‌ సన్నహాక సమావేశం

నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎన్జీవోస్‌ యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణోత్సవ సన్నహాక సమావేశం, ఉద్యో గుల సమస్యలపై శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాల యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.ఎం.హుస్సేని (ముజీబ్‌) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈనెల 24న జరిగే సంఘం డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణలో ఉద్యోగుల అన్ని సమస్యలను ప్రభుత్వం, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిం చుకుందామని డాక్టర్‌ ముజీబ్‌ తెలిపారు. అనంతరం ముజీబ్‌కి స్వామి వివేకానంద సేవా పురస్కార్‌ అవార్డు -2024 లభించిన నేపథ్యంలో టీఎన్జీవోస్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ హైదరాబాద్‌ జిల్లా యూనిట్‌ అధ్యక్షుడు, జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ కె.ఆర్‌. రాజ్‌ కుమార్‌, కార్యదర్శి ఎం. భాస్కర్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ వి.డేవిడ్‌, ట్రేజరర్‌ ప్రేమ్‌ కుమార్‌ వారి కార్యవర్గంతో కలిసి జిల్లా కార్యదర్శి విక్రమ్‌ కుమార్‌, ప్రచార కార్యదర్శి వైదిక్‌ శాస్త్ర, ఈసీ మెంబర్లు, శ్రీధర్‌, ముఖీమ్‌, స్కూల్‌ ఎడ్యూకేషన్‌ యూనిట్‌ ఉపాధ్యక్షులు బి. రవి, జాయింట్‌ సెక్రటరీలు ఇసాక్‌, జయంతి రెడ్డి, ఆర్గ్‌నైజింగ్‌ సెక్రటరీ ఫెరోజ్‌, ఈసీ ముజా హిద్‌, మోయిన్‌, ప్రియాదేవ్‌ ఠాకూర్‌ సమక్షంలో ఆయనకు పూలబోకే అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సభ్యులు సూర్య, రమేష్‌, అరుణ, శివ, , సుదర్శన్‌, కె.పి.అనురాధ, సచ్చిదానంద చారి, జి.రాజ్‌కుమార్‌ విజయలక్ష్మి, ప్రవీణా, కనీజ్‌ ఫాతీమా, రేణుక, హేమావతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love