నేడు హాలియా మున్సిపాలిటీ అవిశ్వాసం

నవతెలంగాణ – హాలియా 
హాలియా మున్సిపల్ ఛైర్పర్సన్ వెంపటి పార్వతమ్మశంకరయ్య, వైస్ ఛైర్మన్ నల్లగొండ సుధాకర్ గురువారం అవిశ్వాస తీర్మానం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో చేతులెత్తే పద్ధతి ద్వారా అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. మున్సిపాలిటీ లో మొత్తం 12 మంది కౌన్సిలర్లుగానూ.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు గెలుపొందారు. ఎక్స్ అఫీషియో ఓటుతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వెంపటి పార్వతమ్మశంకరయ్య ఛైర్పర్సన్ గా, నల్లగొండ సుధాకర్ వైస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇటీవల ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అన్నెపాక శ్రీనివాస్, ప్రసాద్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కౌన్సిల్లో కాంగ్రెస్ బలం ఎనిమిదికి చేరింది. ఈ ఎనిమిది మంది కౌన్సిలర్లు చైర్పర్సన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసం కోరుతూ ఈనెల 10న కలెక్టర్ హరిచందనకు నోటీసు అందజే రు. దీంతో అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషన ర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
Spread the love