నేడు చివరి మండల సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చివరి సర్వసభ్య సమావేశం మండల కేంద్రంలోని ఎంపీడిఓ  కార్యాలయంలో ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్ రెడ్డి అధ్యక్షతన చివరి మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు నూతన ఎంపీడీఓ ఉపేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని ఈ కార్యక్రమానికి మండలంలో మండలం ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, మండలం స్థాయి అధికారులు హాజరు కావాలని అదేవిధంగా వివిధ శాఖల మండల అధికారులు తప్పనిసరిగా తమ పూర్తి నివేదికలతో మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీవో తెలిపారు.ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సమావేశం జరిగేడని ఈసారి ఇదే చివరి సమావేశం కావడం తో ఎంపీటిసి లు హాజరు కావాలని అన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారం గురించి చర్చ జరుగుతుంది కాబట్టి వివిధ రకాల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించు కోవాలని కోరారు.
Spread the love