నేటి మన స్వాతంత్ర దినోత్సవ సంబరం ఎందరో అమర వీరుల త్యాగఫలం

నవతెలంగాణ – బాల్కొండ 
మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు  స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు  వేసి నివాళులు అర్పించారు.అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు అందే వెంకటగిరి మాట్లాడుతూ ఆంగ్లేయుల చెర నుంచి భారత్ ను విడిపించిన వారి కృషి అసాధారణమైనదని స్వాతంత్ర సమరయోధుల త్యాగాలని స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అందే వెంకటగిరి, సెక్రెటరీ ద్యావతి పోశెట్టి, ట్రెజరర్ కటికే శ్రీను, డిస్టిక్ చైర్మన్ సిహెచ్ కిషన్, భూసరత్నాకర్, బరిగిడి మల్లేష్, కళ్యాణ్ రాజేందర్, బూస శ్రీను, భోజన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love