నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ నెల 12న ఉదయం 11.00 గంటలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి రసూల్ బీ మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అవార్డులకు ఎంపికైన ప్రముఖ మహిళలను సన్మానించడం జరుగుతుందని తెలిపారు.