రేపు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటన.!

Minister Duddilla Sridhar Babu's visit tomorrow!నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీదర్ బాబు నేడు ఆదివారం ఉదయం 9 గంటలకు మంథని శ్రీపాద చౌక్, రావుల చెరువు కట్ట వద్ద శ్రీపాద విగ్రహం వద్ద,వర్ధంతి వేడుకలు, ఉదయం 9-30కి కాటారంలోని శ్రీపాద రావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారని మంత్రి పర్సనల్ అసిస్టెంట్ చంద్రశేఖర్ శనివారం తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు. ఉదయం 10 గంటలకు కాటారం నూతన జిపి బిల్లింగ్ వద్ద డిఎంఏప్టి రూ.50 లక్షలతో నిర్మించిన కాటారం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారని పేర్కొన్నారు.రూ.కోటితో స్పోర్ట్స్ స్టేడియం కాంప్లెక్స్ నిర్మాణం (వాలీబాల్ కోర్టు, బాస్కెట్ బాల్ కోచ్, బ్యాడ్మింటన్ కోర్టు,ఓపెన్ జిమ్, క్రికెట్ నెట్,)శంకుస్థాపన,రూ.14 లక్షలతో చిల్డ్రన్స్ పార్క్,రూ.2 కోట్లతో పిడబ్ల్యు రోడ్డు  దామరకుంట నుండి మానేరు వరకు బీటీ రోడ్,రూ.3 కోట్లతో ఒడిపిలవంచ నుండి గూడూరు జెడ్పీ రోడ్డు వరకు బీటీ రోడ్డు,రూ.3 కోట్ల,95 లక్షలతో పిడబ్ల్యు రోడ్డు టు ధన్వాడ బూడిద పల్లి వరకు బీటీ రోడ్డు, రూ.2 కోట్లతో గుండ్రాతుపల్లి నుండి ఉట్లపల్లి పోచమ్మ టెంపుల్ వరకు బీటీ రోడ్డు,రూ.1కోటి 90 లక్షల రూపాయలతో కాటారం మండలంలోని గ్రామాలలో ఎస్సీ కాలనీలో అంతర్గత సిసి రోడ్డు, సైడ్ డ్రైన్స్ నిర్మాణకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.కాటారం, మహాముత్తారం, మలహర్ రావు,మహాదేవ్ పూర్, సంబంధించి ప్రతి మండలానికి ఒక వైకుంఠ రథమును  అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి నాలుగు మండలాలకు అందజేయనున్నారు, కోటక్ మహేంద్ర సి ఎస్ ఆర్ నుండి అందిస్తున్న అంబులెన్స్ ను పలిమెల మండలానికి మంత్రిగారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి అందజేయనున్నారని పేర్కొన్నారు. ఉదయం 11: 30 నిమిషాలకు  శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా  పుష్పగిరి  ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ఉచిత కంటి పరీక్షలు,అద్దాలు పంపిణీ కార్యక్రమాన్ని బిఎల్ ఎన్ గార్డెన్  మంత్రి చేతుల మీదుగా కంటి అద్దాలను పేషెంట్లకు అందజేయనున్నారు. అనంతరం సిఎంఆర్ఏప్ ద్వారా మంజూరైన చెక్కులు కాటారం, మహాదేవపూర్, మహ ముత్తారం, మలహర్ రావు, పలిమెల మండల కు సంబంధించి 243 మంది లబ్ధిదారులకు 1కోటి 90 లక్షల విలువ వేసి చెక్కులను మంత్రి  చేతుల మీది పంపిణీ చేయనున్నారని వివరించారు. మధ్యాహ్నం 3 గంటలకు ధన్వాడ పాఠశాలలో 100 డేస్క్ బెంచ్ లను కాటారం మండలానికి సంబంధించిన 8 పాఠశాలలకు అందించనున్నారు,సబ్ స్టేషన్ వద్ద రూ.1కోటితో ఏర్పాటుచేసిన పి టి ఆర్ ను ప్రారంభోత్సవం చేయనున్నారు, ధన్వడలోని సోలార్ ప్రారంభోత్సవం చేయనున్నారని తెలిపారు.
Spread the love