నవతెలంగాణ – కంఠేశ్వర్
పార్లమెంట్ హాల్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో లోక్ సభ ప్రతిపక్ష నేత ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీతో అయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ బిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ఎంపీ అనిల్ యాదవ్, విప్ లు అది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులు గురువారం భేటీ అయ్యారు. తెలంగాణ కుల ఘనన చేపట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయాలు, నిన్న అనగా బుధవారం ఢిల్లీ జంతర్, మంతర్ వద్ద బిసి సంఘాల దీక్ష తదితర అంశాలను వివరించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ తదితరులు పాల్గొన్నారు. బిసి రిజర్వేషన్లు 42 శాతానికి పెంచే అంశాలపై 9 షెడ్యూల్ లో పెట్టించి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరారు.