– ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి: మండల విద్యాశాఖ అధికారి ఏ .రాందాస్
నవతెలంగాణ – నెల్లికుదురు
టీపీటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను జెడ్పిహెచ్ఎస్ ఆలేరు పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి రాందాస్, టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధాజి కవిత చేతుల మీదుగా సంయుక్తంగా గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి ఏ రామదాసు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా మండల ఉపాద్యాయులు పనిచేయాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత మాట్లాడుతూ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను, ఈ కుబేర్ వద్ద పెండింగ్ లో ఉన్న నూతన ఉపాధ్యాయుల వేతనాలను మరియు ఇతర బిల్లులను వెంటనే చెల్లించాలని నూతన సంవత్సరంలో అయిన ప్రభుత్వం ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యల పైన దృష్టి కేంద్రీకరించి పరిష్కరించే ప్రయత్నం చేయాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు నవీన్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు కే . బిక్షపతి, జయప్రకాష్ ,స్రవంతి, అనిత, బిక్షపతి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.