మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల జిల్లా గురుకుల సాంఘిక సంక్షేమ కళాశాల, జ్యోతిభ పులే పాఠశాల విద్యార్థినిలను దసరా సెలవులకు గురువారం ఇంటికి తీసుకు వెళ్లడానికి విద్యార్థినిల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. పెట్ట, బ్యాగులతో విద్యార్థినిలు రోడ్డు పైకి రావడంతో ఒక్కసారిగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సుమారు ఒక గంట పాటు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుకొన్నరు. వాహనాలను క్రమ పద్దతిలో పంపడానికి పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది లెకపోవడంతో నందిపెట్, దాస్ నగర్ రోడ్డు రద్దీగా మారింది.