ఇటుక బట్టీలకు చెరువుల మట్టి తరలింపు..

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని న్యాల్కల్ గ్రామంలో గల మాసాని చెరువులోని నల్ల మట్టిని నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టిలకు తీసుకెళ్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల యదేచ్చగా రాత్రి పగలు తేడా లేకుండా తమ దందాన్ని కొనసాగిస్తున్నారు. కొందరి నాయకులు అండదండలాతోనే ఇదంతా కొనసాగుతుందినీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మోపాల్ మండల కేంద్ర శివారులో దాదాపు 15 వరకు ఇటుక బట్టీలు ఉన్నాయి నల్ల మట్టిని ప్రతి వేసవిలో చెరువుల్లో నుంచి తరలించి ఏడాదికి సరిపడా నిలువ చేసుకుంటారు. రోజుకి మూడు నాలుగు ట్రిప్పర్లు ఐదు ఆరు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పర్ ధర రూ.3500 వరకు ఉంటుంది. పెద్ద పెద్ద జెసిబిల సహాయంతో రాత్రి పగలు తేడా లేకుండా సాగిస్తున్నారు. ఈ విషయాన్ని నవతెలంగాణ మండల తహసీల్ధార్  రామేశ్వర్ దృష్టికి తీసుకెళ్లగా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Spread the love