ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ ను సీఐడీ అడిషనల్ డీజీగా బదిలీ చేశారు. ఏపీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీ అతుల్ సింగ్ ను యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) డీజీగా బదిలీ చేశారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ శంఖబ్రత బాగ్చీని విశాఖ పోలీస్ కమిషనర్ గా నియమించారు. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు స్థానచలనం కలగడం తెలిసిందే.

Spread the love