Friday, August 21, 2026
E-PAPER
Homeజాతీయంహైడ్రా కమిషనర్‌ ను వీలైనంత త్వరగా బదిలీ చేయండి

హైడ్రా కమిషనర్‌ ను వీలైనంత త్వరగా బదిలీ చేయండి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా మరో శాఖకు బదిలీ చేయాలని హైకోర్టు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది. శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని.. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్టవిరుద్ధమని పేర్కొన్నది. చట్ట పరిధిలో మాత్రమే పాలన కొనసాగాలని, వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని హెచ్చరించింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించండి అని సీఎస్‌కు ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -