– ఫోకల్, నాన్ ఫోకల్ స్పష్టతనివ్వాలి : ప్రభుత్వ ఫార్మాసిస్టుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ఫార్మసిస్టుల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు కె.శంకర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడల్లా ప్రతి ఏడాది బదిలీలు జరిగి ఉద్యోగులందరికీ సమాన అవకాశాలు వచ్చాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో పారదర్శకత లేక ఉద్యోగులకు అన్యాయం జరిగిందని తెలిపారు. 2018లో రంగారెడ్డి జిల్లాలో జరిగిన బదిలీల్లో పట్టణ ప్రాంతంలో పని చేసే వారికి తిరిగి పట్టణ ప్రాంతంలో అవకాశాలిచ్చి గ్రామీణ ప్రాంతాల వారిని విస్మరించారని చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బదిలీలు చేపడుతున్న క్రమంలో తమకు న్యాయం జరుగుతుందని గ్రామీణ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.