సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న  గిరిజనులు

నవతెలంగాణ – పెద్ద కొడంగల్
మండల కేంద్రంలో పాటు మండలంలోని అన్ని గిరిజన  తాండలో సంత్ సేవాలాల్ మహారాజ్ 285 జయంతి వేడుకలను ఘన్నగా జరుపుకున్నారు.సంత్  శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తాండలలో గిరిజనులు నూతన వస్త్రాలు ధరించి వేడుకలో పాల్గొని మందిరం వద్ద భోగ్ భాండార్ నిర్వహించి ప్రసాదం పంచిపెట్టారు.ఈ సందర్బంగా యువతులు మహిళలలు  పెద్దలు కలిసి బంజారా సాంప్రదాయ నృత్యంతో సందడి చేసి  ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం పలువురు మాట్లాడుతూ   సంత్  శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని అన్నారు.గిరిజ‌నుల‌కు ద‌శ‌-దిశ‌ను చూపి, హైందవ ధ‌ర్మం గొప్ప‌ద‌నం, విశిష్ట‌తల‌ను తెలియ‌ జేయడానికే సేవాలాల్ మ‌హారాజ్ జ‌న్మించారని చరిత్రకారులు చెబుతారని తెలిపారు.బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్ర‌పంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని ఇది మన  బంజారా జాతికే పెద్ద గర్వకారణం ఉందని అన్నారు. అంతే కాకుండా శ్రీ సంత్‌ సేవాలాల్ ఇత‌ర కులాల వారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. దింతో ప్రతీ ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గిరిజనుల పై ఉందని  సూచించారు.గిరిజన యువతి యువకులు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో నడ్చుకొని దైవ భక్తిలో అడుగులు వెయ్యలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తాండ పెద్దలు నాయక్ లు ,కరోభారిలు,యువకులు మహిళలు పాల్గొన్నారు.
Spread the love