మహిళా దినోత్సవ సందర్భంగా డాక్టర్ శరణ్యకు సన్మానం 

నవతెలంగాణ – రామగిరి
లయన్స్  క్లబ్  సెంటినరికాలనీ  ప్రెసిడెంట్ మొలుమురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటీవల రాష్ట్ర, జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్న ప్రకృతి వైద్య నిపుణురాలు డాక్టర్ శరణ్య ను  లయన్స్   క్లబ్   సభ్యులందరూ కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన  లయన్స్ క్లబ్ డైరెక్టర్ మిరియాల రాజిరెడ్డి హాజరై మాట్లాడుతూ,   వైద్య  సేవా రంగంలో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ శరణ్య కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిందనీ,ఎంతోమంది మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేశారనీ, ఆ పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామనీ అన్నారు. అలాగే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళామణులు సృష్టిస్తున్న విజయాలు మహిళల గొప్పతనాన్ని చెప్పకనే చెబుతున్నాయనీ, గృహిణిగానే కాకుండా వ్యవసాయం మొదలుకొని దేశ సరిహద్దుల్లో రక్షణ వరకు, అంతరిక్ష ప్రయోగాలలో విజయాలను సాధించే వరకు మహిళలు పోషిస్తున్న పాత్ర గణనీయమైనదనీ, భవిష్యత్తులో మహిళల్లో స్పూర్తిని నింపి స్వావలంబన సాధించే దిశగా నడిపించటమే లక్ష్యంగా లయన్స్   క్లబ్ పనిచేస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి కొంక పోచం, లయన్స్  డైరెక్టర్స్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి, దుబ్బాక సత్య రెడ్డి,కళాధర్ రెడ్డి ,దొడ్ల శ్రీనివాస్ ,మేకల మారుతి, తీగల శ్రీధర్, దొంతుల సురేష్,కేశవ రావు,చందుపట్ల ప్రతాప్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.
Spread the love