గాంధారి మండలంలోని తిప్పారం గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను గ్రామ ప్రజలు నాయకులు ఘనంగా సన్మానించారు. గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిప్పారం గ్రామంలోని గ్రామ సర్పంచ్ సాయిలు, ఉపసర్పంచ్ లక్ష్మణరావు, వార్డు మెంబర్లకి తిప్పారం గ్రామంలో సన్మానించడం జరిగింది .ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత పదవులు నిర్వహించి గ్రామానికి మంచి పేరు తేవాలని ప్రజలు కోరారు .