దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు ఘన నివాళులు

నవతెలంగాణ-నిర్మల్‌
బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర మేధావి, భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా మున్సిపల్‌ చైర్మెన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ కౌన్సిల్‌ సభ్యులతో కలిసి, శుక్రవారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారత దేశం రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేత, బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొండ సబిత శ్రీధర్‌, రామగోని తులసి నర్సాగౌడ్‌, అన్వర్‌పాషా, కోఆప్షన్‌ సభ్యులు చిలుక గోవర్ధన్‌ ఉన్నారు.
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో…
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు కూచడి శ్రీహరావు పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. భారత ప్రధాని తెలుగు జాతికి గర్వ కారణమని కొనియాడారు. కార్యక్రమంలో ప్రముఖ సీనియర్‌ న్యాయవాది, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అల్లూరి మల్లారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి రాజేశ్వర్‌, నిర్మల్‌ పట్టణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, మున్సిపల్‌ కౌన్సిలర్‌లు గండ్రత్‌ రమణ, ప్రభాస్‌ లేబర్‌ యూనియన్‌ అధ్యక్షులు పరికిపండ్ల స్వదేశ్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు పుదారి అరవింద్‌, గాజుల రవికుమార్‌, గణేష్‌, అడపా శ్రీకాంత్‌, గడ్డింటి ప్రశాంత్‌, సారంగాపూర్‌ మండల కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ సాకిపెల్లి సురేందర్‌, కాంగ్రెస్‌ నిర్మల్‌, సోన్‌, సారంగాపూర్‌ మండలాల నాయకులు మధుకర్‌రెడ్డి, వేణు, బొల్లోజు నర్సయ్య, మండలాల కాంగ్రెస్‌ నాయకులు రాజ్‌ మహమ్మద్‌, శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్య కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌రూరల్‌: భారత దేశంలో ఆధునిక అర్థిక వ్యవస్థను రూపొందించేలా అనేక ప్రణాళికలను రూపొందించిన మహానుభావుడు ఆయన జీవితం ప్రతీ కాంగ్రెస్‌ వాదికి ఆదర్శమని తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. స్వర్గీయ పీవీ నర్సింహారావు దేశ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు భారత జాతి ఎన్నటికీ మరువదని అన్నారు. శుక్రవారం పీవీ నర్సింహారావు జయంతిని పురస్కరించుకుని తన నివాసంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశాన్ని ఏలిన తొలి తెలుగు తేజం, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని గుర్తుచేశారు. బహుభాషా కోవిదుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, దేశ అభ్యున్నతికి కొత్త బాటలు వేసిన ఆర్థికవేత్త పీవీ అని అన్నారు. దేశంలో భూసంస్కరణల చట్టం చేసి ప్రధానిగా పూర్తికాలం దేశానికి సుస్థిర పాలన అందించారని అన్నారు. తెలుగు రాష్ట్ర అభ్యర్థిని ప్రధానిగా చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని, ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు చంద్రశేఖర్‌, వైస్‌ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు నలిమెల నవీన్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు, కుదురు పక్క సురేష్‌, నాగరాజు, రంజిత్‌, శ్రీనివాస్‌, వెంకటేష్‌, అడెల్లు, దినేష్‌ పాల్గొన్నారు.

Spread the love