– 7,26,837 మంది ఎంపిక
– త్వరలో మెరిట్ జాబితా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-4 రాతపరీక్షలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించామని తెలిపారు. గతేడాది జూలై ఒకటిన గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పేపర్-1కు 7,62,872 (80 శాతం) మంది, పేపర్-2కు 7,61,198 (80 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. 7,26,837 మందిని జనరల్ ర్యాంకింగ్ జాబితాలో ఎంపిక చేశామని వివరించారు. త్వరలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. త్వరలోనే మెరిట్ జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు.అభ్యర్థులు ఫలితాల కోసంష్ట్ర్‌్‌జూ://షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెట్‌సైట్‌ను సంప్రదించాలని సూచిం చారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం 2022, డిసెంబర్ ఒకటిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే.