ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సొంత భవనాన్ని నిర్మించాలి: తుమ్మల పద్మ 

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ పట్టణంలోని మన్యం చెలక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సొంత భవనం నిర్మించాలని ఐద్వా అధ్యక్ష, కార్యదర్శిలు  తుమ్మల పద్మ, భూతం అరుణకుమారి లు డిమాండ్ చేశారు. శుక్రవారం మార్నింగ్ చేరిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రనికి సొంత భవనం లేక  ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అదేవిధంగా 15 మంది సిబ్బంది, ఒకరే వైద్యులు ఉన్నారని రోజుకు సుమారు వందమంది పేషెంట్లు పి హెచ్ సి కి వస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు ఒక్కరే ఉన్నందున పేషెంట్లను చూడడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అందువల్ల మరొక వైద్యున్ని కూడా నియమించాలని కోరారు. ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమం ఉంటుందని, ఒకే డాక్టర్ రోజు  100 మందికి పైగా వైద్య సేవలు అందిస్తున్నారని, రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా మరొక వైద్యుని వెంటనే నియమించాలని కోరారు. పిహెచ్సి లో పనిచేసే సిబ్బందికి ప్రతినెల వేతనాలు చెల్లించాలని,  వైఫై కనెక్షన్  సొంత ఖర్చులతోనే ఉపయోగిస్తున్నారని, కరెంట్ బిల్లు కూడా 20 వేలు పెండింగ్ లో ఉందని తెలిపారు. ఈ సమస్యలపై త్వరగా ప్రభుత్వం స్పందించి  కావలసిన నిధులు కేటాయించాలి అని డిమాండ్ చేశారు.
Spread the love