
ఉద్యోగులు సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్ దాఖలు కోసం ఎస్ టి ఓ కార్యాలయంలో ఫామ్ 16 దాఖలు చేయాలి దీంతో ఉద్యోగులు కార్యాలయానికి వెళితే కార్యాలయ అధికారులు వారికి చుక్కలు చూపెడుతున్నారు. పైసలిస్తేనే ఫామ్ 16 ఐటీ ఫార్మ్స్ తీసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పైసలు ఇచ్చుకుంటేనే బిల్ పాస్ అవుతుందని ఎస్ టి ఓ కార్యాలయంలో అధికారులు చెబుతుంటే ఉద్యోగస్తులు అవాక్కు అవుతున్నారు.ఎస్టీఓ పరిధిలో నాలుగు మండలాల అన్ని శాఖల ఉద్యోగులు.ఉపాధ్యాయులు తమ వేతనాల కోసం ప్రతి నెల జీతాలకు సంబంధించిన బిల్లులను సమర్పిస్తుంటారు.అయితే ఉద్యోగస్తులు ప్రతి మార్చి నెలలో వార్షిక వేతనాలకు సంబంధించి ఐటీ రిటర్న్ పత్రాలను దాఖలు చేస్తేనే ఫిబ్రవరి వేతనం అందుతుంది.దీంతో ఉద్యోగులు కింద మీద పడి తాము తీసుకున్న హౌస్ లోను,ఎడ్యుకేషన్ లోను,తదితర లోనులు తీసుకున్నవారు,వాటికి ఇంట్రెస్ట్ అమౌంట్ కు సంబంధించిన పత్రాలను ఎస్ టి ఓ కార్యాలయంలో సమర్పించాలి.అయితే అట్టిపత్రాలను సమర్పించేందుకు కార్యాలయానికి వెళితే వాటిలో ఎన్నో తప్పులు ఉన్నాయని కొర్రీలు పెట్టి ప్రతి ఒక్క ఫామ్ కు ధర నిర్ణయించారు.దీంతో సంబంధిత శాఖల ఉద్యోగులు తప్పనిసరిగా డబ్బులను కార్యాలయంలో సమర్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ఒకవేళ ఉద్యోగస్తులు తప్పుడు పత్రాలను సమర్పిస్తే మా కార్యాలయానికి సంబంధం లేదని అది సంబంధిత శాఖల వారే బాధ్యులవుతారని తెలుపుతున్నారు.ఉద్యోగులు సైతం తమ వంతుగా1000 రూపాయలు నుండి1500 రూపాయలు కార్యాలయంలో సమర్పించి చేతులు దులుపుతున్నట్లు సమాచారం.మరికొందరు ఉద్యోగులు ఐటీ నుండి తప్పించుకోవడం కోసం నాన ఇబ్బందులు పడుతూ తప్పుడు ఐటీ ఫార్మ్స్ ను సమర్పిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.వీటిని దృష్టిలో పెట్టుకుని ఎస్ టి ఓ కార్యాలయంలో డబ్బులు ఇస్తేనే మీ బిల్ పాస్ అవుతుందని కరాకండిగా చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగి కార్యాలయంలో డబ్బులు సమర్పించుకుంటున్నారు.ఇటీవల ఏఎన్ఎం గా హెల్త్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు సాధించిన వారు వారి రిజిస్టర్ నెంబర్ కోసం,మొదటి నెల వేతనాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరు 500 చొప్పున ఒక మధ్యవర్తి ద్వారా ఇచ్చినట్లు సమాచారం.ఇది అంతా బహిరంగంగానే జరుగుతుందని తప్పనిసరిగా ప్రతి ఉద్యోగి ఎస్ టి ఓ కార్యాలయంలో డబ్బులు చెల్లించాల్సిందేనని ఆఫీసర్లు తెలుపటంతో,ఉద్యోగులు కార్యాలయంలో డబ్బులు చెల్లిస్తున్నారు.ఇదిలా ఉండగా లోను కు సంబంధించిన పత్రాలు అన్ని మండల కేంద్రంలోని ఒక కంప్యూటర్ ఆపరేటర్ బ్యాంకు మేనేజర్ స్టాంపు తయారు చేసుకొని ఇస్తున్నట్లు లోకల్ సమాచారం.ఈ విషయంపై కార్యాలయం ముందు ఉద్యోగస్తులు గుసగుసలు చేసుకుంటున్నారు.ఇదిలా ఉండగా, ఇలాగా వసూలు చేసిన డబ్బులు కార్యాలయంలో పనిచేసే ఒకరిద్దరికి మాత్రమే చెందుతుందని మేము పనిచేయడం లేదా మాకెందుకు ఇవ్వరు అని కిందిస్థాయి ఉద్యోగులు సైతం పై అధికారులు నిలదీస్తున్నట్లు సమాచారం. ఎస్ టి ఓ వివరణ:: కార్యాలయంలో ఎలాంటి అవినీతి జరగడం లేదని,కార్యాలయానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనిచేస్తున్నానని,పడని వారు కావాలని కొంతమంది నా మీద ఇలాంటివి సృష్టిస్తున్నారని అన్నారు.