కందికల్ గేట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో శుక్రవారం తెల్లవారుజామున  ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పుట్టిన రోజు వేడుకలని స్నేహితుడి దగ్గర బైక్​ తీసుకుని మండి బిర్యానీ తిని బైక్​పై ట్రిపుల్​ రైడింగ్​ చేస్తూ ఇంటికి వస్తుండగా కందికల్​ గేట్​ ఫ్లైఓవర్​ బ్రిడ్జి పై అతి వేగంగా నిర్లక్ష్యంగా కరెంట్ పోల్‌ను​ ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్​పై ఉన్న ముగ్గురిలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో పాతబస్తీ ఛత్రినాక జయప్రకాశ్​ నగర్​లో తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఛత్రినాక ఏసీపీ చంద్రశేఖర్​ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఛత్రినాక జయప్రకాష్​నగర్‌కు చెందిన అమర్​సింగ్‌కు ఇద్దరు సంతానం. కూతురు శిల్ప ఠాకూర్, ఠాకూర్​రాధా కిషన్ (24)​లు సంతానం, ఠాకూర్ రాధా కిషన్ వృత్తి రీత్యా ఏసీ మెకానిక్. రాధాకిషన్​పుట్టిన రోజు ఉందంటూ తన స్నేహితుడు పాతబస్తీ ఛత్రినాక కు చెందిన రోహన్​ చౌకట్ ​వద్ద బైక్​ను శుక్రవారం తెల్లవారుజామున 1 గంటలకు తీసుకున్నారు. అనంతరం ఆ బైక్​పై రాధాకిషన్​ఛత్రినాక కు చెందిన జ్ఞానేశ్వర్​ఇంగ్లే కుమారుడు వైజనాథ్​ఇంగ్లే అలియాస్ సోను (30)తో పాటు శివ పార్వతి నగర్​కు చెందిన తిరుపతయ్య కుమారుడు కె.నిఖిల్​కుమార్​(18) లను తీసుకుని ట్రిపుల్ రైడింగ్​చేస్తూ చాంద్రాయణగుట్ట ప్రాంతంలో మండి బిర్యాని తినడానికి తీసుకెళ్లాడు. భిర్యాని తిన్నాక తిరిగి ఇంటికి చేరుకుంటున్న తరుణంలో రాధా కిషన్​ బైక్‌ను నడుపుతుండగా సోను మధ్యలో, వెనుకాల సీటులో నిఖిల్​కుమార్ కూర్చున్నాడు. తెల్లవారుజామున 3.30గంటల ప్రాంతంలో చాంద్రాయణగుట్ట నుంచి ఛత్రినాక కు వస్తున్న క్రమంలో కందికల్​ గేట్​ ఫ్లైఓవర్​బ్రిడ్జి పైన అతివేగంగా నిర్లక్ష్యంగా నడుపుతు అదుపుతప్పి మొదట డివైడర్‌ను తాకుతూ కరెంట్​ పోల్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు కిందపడి పోయారు. తలకు బలమైన గాయాలైన రాధాకిషన్‌ను చికిత్స నిమిత్తం ఎల్​బినగర్​లోని గ్లెనెగల్స్​అవేర్ ​ఆస్పత్రికి తరలించారు. వైజనాథ్, నిఖిల్‌లను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గ్లెనెగల్స్​అవేర్ ​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధాకిషన్ మృతిచెందగా, వైజనాథ్​ ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. తీవ్ర గాయాలపాలైన నిఖిల్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Spread the love