జన్నారంలోని సింగరాయపేట తపాలపూర్ గ్రామాల్లో కడెం ప్రాజెక్టు ప్రధాన డిస్ట్రిబ్యూటరీ కాలువలు 19, 22 ద్వారా రైతుల యాసంగి పొలాలకు చివరి ఆయకట్టు వరకు మరో రెండు చదువుల నీరందించాలని చింతగూడ పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ కమ్మల విజయ ధర్మ అన్నారు. మంగళవారం సింగరాయపేట గ్రామ శివారులో రైతులతో కలిసి నిరసన తెలిపారు సందర్భంగా వారు మాట్లాడారు. ఈ రెండు గ్రామాల ఏరియాలో దాదాపు 15 0ఎకరాలకు ఇంకో రెండు తడుల నీరు అందిస్తే పూర్తి స్థాయిలో పంటలు పండుతాయన్నారు. లేకుంటే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి ఈ రెండు డిస్ట్రిబ్యూటరీల ద్వారా మరో రెండు తడుల నీటిని అందించి, పంటలు ఎండిపోకుండా చూడాలన్నారు. మీరు అందించకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. నీరు అందించి రైతులను ఆదుకోవాలి అన్నారు. కార్యక్రమంలో మామిడి భూమన్న ఆకుల రవికుమార్ కొమరయ్య రామన్న లచ్చన్న ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.