విద్యుత్ షాక్ తో రెండు బర్లు మృతి..

– జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి 
– రైతు గుగులోతు లకు పతి, రైతు బానోతు లచ్చిరాం
నవతెలంగాణ – నెల్లికుదురు
విద్యుత్ షాక్ తో రెండు బర్రెలు మృతి చెందాయని నాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు గుగులోతు లక్ పతి మరియు బానోతు లచ్చిరాం బుధవారం ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను కోరారు. మండలంలోని వస్త్రం తండా గ్రామపంచాయతీ శివారు లాస్య తండాకు చెందిన రైతులు గుగులోతు లక్ పతి బానోతు లచ్చిరాం మాట్లాడుతూ నాకు ఉండబడినటువంటి ఒక్కొక్కరికి ఒక బర్రె మేతకు వెళ్లిందని మేత మేస్తున్న క్రమంలో పక్కనే ఉన్న పార్వతమ్మ గూడెం గ్రామాల్లో బర్రెలు మేత వేసుకుంటూ వెళ్తున్న క్రమంలో విద్యుత్ వైరు తాకి విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. మృతి చెందిన ఒక్కొక్కరి బర్రె రూ.70 వేల రూపాయల విలువ ఉంటుందని రెండు కలిపి రూ.1,40,000 విలువ చేసే బర్రెలు మృతి చెందడం బాధాకరమని అన్నారు. వెంటనే ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు స్పందించి నాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అధికారుల ద్వారా ఇప్పించి ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు.
Spread the love