నవభారత్ హైస్కూల్‌లో ఉగాది సంబరాలు

IMG-202455032నవతెలంగాణ-హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్‌లోని నవభారత్ హై స్కూల్‌లో శనివారం ఉగాది వేడుకలను కరస్పాండెంట్ గంగరవేణి రవి, ప్రిన్సిపాల్ శ్రీను ఆధ్వ‌ర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఉగాది పచ్చడి షడ్రుచులు (తీపి, కారం, చేదు, వగరు, పులుపు, లవణం)లతో చేసిన పచ్చడి చేశారు. పాఠశాలలో ప్రతీ సంవత్సరం ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకుంటామని కరెస్పాండెంట్ తెలిపారు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో విద్యార్థులు, ఉపాద్యాయులు, ప్రజలు అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయ‌న కోరారు.

Spread the love