- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. రష్యా దక్షిణ ప్రాంతమైన వోల్గోగ్రాడ్‌లోని ఒక పారిశ్రామిక కేంద్రంపై జరిగిన డ్రోన్ దాడి కాల్పులకు దారితీసిందని ప్రాంతీయ గవర్నర్ ఆండ్రీ బోచరోవ్ బుధవారం తెలిపారు. ఇంధన మరియు పౌర మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడిని వైమానిక దళాలు తిప్పికొడుతున్నాయని అన్నారు. ఈదాడితో నివాససముదాయంలోని అపార్ట్‌మెంట్ ధ్వంసమైందని, కిండర్‌గార్డెన్ ఉన్న ప్రాంతంలో డ్రోన్ శిథిలాలు పడ్డాయని అన్నారు. ఈ దాడికి సంబందించి పూర్తి సమాచారం తెలియాల్సి వుందని చెప్పారు.
- Advertisement -



