
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రపంచ మెట్రోలజీ డే సందర్భంగా సోమవారం నల్గొండ జోన్ అసిస్టెంట్ కంట్రోలర్ కె. సిద్ధార్థ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారి పి. రామకృష్ణ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలోని దేవరకొండ, కొండమల్లేపల్లి లోగల పలు పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి వినియోగదారులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. నల్గొండ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాస్ నల్గొండ పట్టణంలోని పలు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఐరన్ హార్డ్వేర్, సిమెంట్ వ్యాపారస్తులపై ప్యాకేజింగ్ రూల్స్ ఉల్లంఘించినందుకు గాను 12 కేసులు నమోదు చేయడం జరిగిందని, అంతేకాకుండా వ్యాపారస్తులు అమ్మే వస్తువులపై మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్, రిటైల్ ప్రైస్, నెట్ క్వాంటిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, బెస్ట్ బిఫోర్, వంటి ప్యాకేజింగ్ నిబంధనలను పాటించకపోతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ పి. రామకృష్ణఈ సందర్భంగా హెచ్చరించారు.