భారత ఎగుమతుల్లో అనిశ్చితి

Confidence in Indian Exportsన్యూఢిల్లీ : అమెరికా సుంకాలను నిలిపివేసినప్పటికీ భారత ఎగుమతుల్లో అనిశ్చితి నెలకొంది. చాలా దేశాలపై అమెరికా విధించిన పరస్పర సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయడం భారత ఎగుమతిదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. అయినప్పటికీ అమలులో ఉన్న 10 శాతం బేస్‌లైన్‌ సుంకాల భారాన్ని ఎవరు భరించాలనే దానిపై ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సుంకం తమ లాభాలను ఒత్తిడికి గురిచేస్తోందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. వియత్నాం, బంగ్లాదేశ్‌ వంటి పోటీ దేశాలు బేస్‌లైన్‌ సుంకాలను భర్తీ చేయడానికి అమెరికా కొనుగోలుదారులకు డిస్కౌంట్లను అందించవచ్చని ఎగుమతిదారులు అంటున్నారు. భారత్‌ కంటే ముందు ఆయా దేశాలు అమెరికాలో ద్వైపాక్షిక ఒప్పందాలకు సిద్ధం అవుతున్నాయని తెలిపాయి. ”10 శాతం బేస్‌లైన్‌ టారిఫ్‌ను ఎవరు చెల్లిస్తారనేది పెద్ద ప్రశ్న..? ఇది వినియోగదారుడా, దిగుమతిదారుడా, ఎగుమతిదారుడా లేదా వారందరూ పంచుకుంటారా? ఏదైనప్పటికీ పరిశ్రమలో డిమాండ్‌ తగ్గడం ద్వారా మార్జిన్లు పడిపోనున్నాయి.” అని టెక్స్‌టైల్‌ కమిటీ ఐసీసీ చైర్మెన్‌ సంజరు జైన్‌ పేర్కొన్నారు.

Spread the love