నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో ప్రత్యక్ష యుద్ధానికి తెరపడి..మరోమారు ఇరాన్-అమెరికాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శాంతి చర్చలపై ఇరుదేశాల మధ్య సందిగ్ధం నెలకొంది. శాంతి ఒప్పందంపై ట్రంప్ ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారని,ఇరాన్ అభిప్రాయాలకు ప్రతికూలంగా ఉందని, కీలక అంశాలైన హర్మూజ్ టోల్ ఫీజు, యుద్ధం కారణంగా ఆర్థిక నష్టపరిహారం తదితర అంశాలపై సరైన వివరణలేదని ఇరాన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది.
ఈ ఒప్పందం రెండు దశలతో కూడుకున్నదని, మొదటి దశలో అణు అంశంపై చర్చ జరగలేదని, దానిని రెండో దశకు వాయిదా వేశారని ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చి తెలిపారు. అవగాహన ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయకపోతే, తుది ఒప్పందంపై సంతకాలు జరగవని ఆయన స్పష్టం చేశారు. “అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలన్నదే ఈ ఒప్పందంలో పేర్కొన్న మొదటి అంశం,. “అంతర్జాతీయ చట్టం ప్రకారం హార్ముజ్ జలసంధి వద్ద ‘టోల్’ (సుంకం) వసూలు చేయడం సాధ్యం కాదు, కానీ సేవా రుసుములను మాత్రం వసూలు చేస్తారు. ఇరాన్‌కు పరిహారం చెల్లించే ప్రణాళిక కూడా ఉంది.’ అని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు ట్రంప్ మాత్రం అంత సిద్దంగా ఉంది ఇరాన్ సంతకాలు చేయడమే ఆలస్యమని మీడియా ముందు ఆర్భాటం చేస్తున్నారు. శుద్ది చేసిన యురేనియం అమెరికాకు చెందాలని ట్రంప్ మొండిపట్టుకుదిగుతున్నారని అంతర్జాతీయ మీడియాలు వార్తలు వెలువరించాయి. ఈక్రమంలోనే రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు ఆలస్యమైతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



