మండలం లోని గుమ్మడి వల్లి ప్రాజెక్ట్ కు ఇటీవల వరదలకు గండి పడి సర్వం కోల్పోయిన నిర్వాసితులకు కాంగ్రెస్ ఆద్వర్యంలో సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు నేతృత్వం లో 70 కుటుంబాలకు సోమవారం నిత్యావసరాలు అందించారు. ఈ ప్రాజెక్ట్ పరీవాహక గ్రామాలు అయిన గుమ్మడవల్లి,కొత్తూరు ల్లో నిత్యవసర సరుకులు బియ్యం,కూరగాయలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా,జ్యేష్ట సత్యనారాయణ చౌదరి,సత్యవరపు బాల గంగాధర్,పాలవలస జీవన్ రావు,కోడూరి శ్రీనివాసరావు,సింహాచలం, భూక్యా ప్రసాద్,బద్దె చిట్టె ఊరుయ్య,ముని రాజు, మెకానిక్ వెంకన్న,యూత్ కాంగ్రెస్ నాయకులు ఆకరి పల్లి రాంబాబు,గండికోట రాంబాబు వల్లెపు సురేశ్,డేరంగుల సోమయ్య,తమ్మిశెట్టి శ్రీను, చిన్ని తదితర కాంగ్రెస్ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.