
నిరుద్యోగ యువతీ యువకులకు ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సూర్యాపేట మేనేజర్ భరత్ కుమార్ తెలిపారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ కు నెలకు 18 వేల రూపాయలు,మేనేజర్ పోస్ట్ కు నెలకు 25 వేల రూపాయలు జీతం చెల్లిస్తారన్నారు. 22 నుండి 35 సంవత్సరాల వయసు కలిగి అర్హత గల అభ్యర్థులు సోమవారం(22/07/2024) తిరుమలగిరి మండల కేంద్రంలోని సరస్వతి డిగ్రీ కాలేజీలో ఉదయం 11 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు బయోడేటా, ఆధార్ కార్డ్, విద్యార్హత సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ,పాస్ ఫోటోతో హాజరు కావాలన్నారు.మరిన్ని వివరాలకు 9110549902,9966264936 నెంబర్లో సంప్రదించాలన్నారు.