ఉపాధి లేని పట్టభద్రులకు నిరుద్యోగ భృతి చెల్లించాలి..

నవతెలంగాణ – బొమ్మలరామారం

డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం ఉపాధి లేని వారికి నిరుద్యోగ భృతి చెల్లించాలని పట్టభద్రుల సంఘం బొమ్మలరామారం మండల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మండల స్థాయి పట్టభద్రుల ‘ఆత్మీయ ‘సమ్మేళనం మండల కేంద్రంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి మండల కేంద్రము లో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్వయం ఉపాధి కోసం ఎలాంటి షరతులు లేకుండా 10లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని, మండల కేంద్రంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ స్టడీ మెటీరియల్ ను అందుబాటులో ఉంచాలని, స్థానిక పరిశ్రమల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి 50శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ముఖ్యంగా బొమ్మలరామారం మండల కేంద్రంలో డిగ్రీ,ఐటీఐ, పాలిటెక్నిక్,పీజీ కాలేజీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.వీటిపై భవిష్యత్తులో పట్టభద్రులంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం పట్టభద్రుల సంఘం మండల కన్వీనర్ గా మైలారం జంగయ్య,కో కన్వీనర్లు కొడిమాల శ్యాంసుందర్ రెడ్డి,ఎలబోయిన శ్రీహరి,గుల్లని మహేష్,వడ్త్యా రమేష్,జె. విజయరాజు,ఎ. విశ్వనాథ్, నాగరాజు,అనిల్, విశ్వరూప్ పాల్గొన్నారు.
Spread the love