Monday, May 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమీడియా సంస్థలపై కేంద్రమంత్రి బండి పరువు నష్టం దావా

మీడియా సంస్థలపై కేంద్రమంత్రి బండి పరువు నష్టం దావా

- Advertisement -

257 పేజీలతో కూడిన కేసు దాఖలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తన పరువుకు భంగం కలిగేలా వార్తలు, కథనాలు ప్రసారం చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ‌మీడియా సంస్థలు, ఎక్స్‌ ‌ఖాతాలు, యూట్యూబ్‌ లింకులపై ఆయన పరువు నష్ట దావా వేశారు. ఆదివారం ఈమేరకు ఆయన మీడియాకు 257 పేజీలతో కూడిన కేసు ఫైల్‌ ‌విడుదల చేశారు. అందులో శాటిలైట్ ఛానళ్లు, పలు యూట్యూబ్ ఛానళ్లు, ఎక్స్ అకౌంట్లు, ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. 22 ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలు, 50 ఎక్స్‌ ఖాతాలు, 99 ఇన్‌‌స్ట్రాగ్రామ్‌‌లు, 45 యూట్యూబ్‌, వాటి లింకులపై ఆయన దావా వేశారు. ఇటీవల బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడంతో దానిపై మీడియా సంస్థలు పలు కథనాలు ప్రసారం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -