Sunday, July 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్'మాదిగల పుణ్యక్షేత్రం'శంకుస్థాపన వాల్ పోస్టర్ ఆవిష్కరణ.!

‘మాదిగల పుణ్యక్షేత్రం’శంకుస్థాపన వాల్ పోస్టర్ ఆవిష్కరణ.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని,ఈ నెల 7వ ఈదుమూడి గ్రామంలో ‘మాదిగల పుణ్యక్షేత్రం’ శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్ చేతులమీదుగా వాల్ పోస్టర్ ను ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బూడిద సమ్మయ్య ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరై ఈ పుణ్యక్షేత్ర శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.మాదిగ జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే “మాదిగ అమరవీరుల స్తూపం”ఇక్కడ ప్రతిష్టించనున్నట్లు వివరించారు.ఈ చారిత్రాత్మక మహోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులు,కార్యకర్తలు,మాదిగ మహాజనులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బూడిద సాగర్,భూమయ్య, రమేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -