దాతల సహకారంతో యూపీఎల్ టోర్నీ అదుర్స్

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండల లెవల్ కాంసాని పల్లి సమీపంలో యూపీఎల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ పలువురు దాతల సహకారంతో క్రీడలు కొనసాగుతున్న ప్రాగణంలో అన్ని వసతులతో మౌలిక సదుపాయాలు కల్పించి క్రీడాకారుల నుంచి ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నారు. క్రీడా మైదానంలో పోలీసు సిబ్బంది, ఫస్ట్ ఎయిడ్ కిట్ తో ఆశ వర్కర్ల సిబ్బంది, తాగునీరు, టెంట్లు కుర్చీలు, మధ్యాహ్నం భోజనం, క్రీడాకారులకు డ్రస్సులు, మ్యాచ్ బ్రేక్ టైం లో మంచినీటి సదుపాయం నాణ్యతతో కూడిన సౌకర్యాలు, ప్రత్యేకంగా కామెంట్రీ, ఎంపీ ఆర్ తో పాటు ఎలాంటి లోటు లేకుండా  క్రీడలను ప్రోత్సహించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేలా చక్కటి విధి విధానాలతో నిర్వహిస్తున్న క్రీడాకారుల పై నవతెలంగాణ ప్రత్యేక కథనం.
మండలంలోని యువతను క్రీడలతో నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రోత్సహించేలా సహకారాన్ని అందిస్తున్న పలువురు ముఖ్యులు మండల స్థాయి నాయకులు ఎంపీపీ తిప్పర్తి అరుణ నరసింహారెడ్డి 40 వేల రూ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి 30 వేల రూ, కర్నే లక్ష్మీనారాయణ అడ్వకేట్, మాజీ సర్పంచ్ 25 వేల రూ, గోపిరెడ్డి అనురాధ రఘుపతి రెడ్డి (ఎంపీటీసీ) 20 వేల రూ, కొట్టే శ్రీను యాదవ్ 10 వేలు రూ, కలమండల రామస్వామి, మాగాని రాంబాబు 5 వేల చొప్పున, కట్ట అచ్యుతారెడ్డి, కొట్టే శ్రీను యాదవ్, గందెసిరి మనోహర్, భయ్యా నరేష్ యాదవ్, వెల్టూరి రేనయ్య యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు టోర్నమెంట్ సలహాదారులుగా సహకరిస్తున్న దాతలకు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ యజమాన్యం చెన్నకేశవులు, వినోద్, క్రికెట్ అభిమానులు ప్రజలు అభినందనలు తెలిపారు.

దాతల సహకారంతో:  మేము యుపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం, రానున్న రోజులలో ప్రభుత్వం, పాలకులు క్రీడా ప్రాగణాలు, ఆట వస్తువులు, క్రీడల పై ప్రత్యేక దృష్టి పెట్టి క్రీడలను మరింత మెరుగ్గా ప్రోత్సహించే విధంగా కృషి చెయ్యాలి – యుపిఎల్ ఆర్గనైజర్, క్రీడాకారుడు, కె. చెన్నకేశవులు, కంసానిపల్లి. కరోనా నుంచి క్రికెట్ మైదానంలో హైదరాబాద్, జిల్లా పరిధిలో జరిగే క్రీడలలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కామెంట్రీ చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కొనసాగుతున్న ఈ టోర్నీ కి ఆహ్వానించిన ఆర్గనైజర్స్ కి అభినందనలు తెలుపుతూ, క్రీడా శాఖ అధికారులు నన్ను గుర్తించి రానున్న రోజులలో క్రికెట్ స్టేడియాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవకాశం రావాలని పై స్థాయికి ఎదగాలని ఉంది – యం డి, మజీద్ కామెంటరీ, ఇప్పలపల్లి యుపిఎల్ టోర్నీలో ఎంపీ ఆర్లుగా కొనసాగుతునం క్రీడా శాఖ అధికారులు క్రీడాకారులకు క్రికెట్ మైదానానికి సరిపోయినంత భూమిని ప్రభుత్వం గుర్తించి మండలానికి ఒకటి చొప్పున క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి క్రీడాకారుల నైపుణ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడలవైపు దృష్టి పెట్టే విధంగా ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు ప్రోత్సహించి మరింత మెరుగుపరచాలి.
-రాకేష్ , అశోక్, కాంసాని పల్లి.
Spread the love