జిల్లా సమాచారం పౌరసంబంధాల అధికారిగా ఉప్పర వెంకటేశ్వర్లు

– ఏపీపీఎస్సీ ద్వారా 1989లో నియామకం

– ఏపీఆర్ఓ, డివిజనల్ పిఆర్ఓ, కలెక్టర్ పిఆర్వో గా చేసిన అనుభవం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా సమాచార  పౌర సంబంధాల అధికారిగా ఉప్పర వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం నల్లగొండ జిల్లా పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన పి. శ్రీనివాసును మహబూబ్ నగర్ జిల్లాకు  అక్కడ ఏడిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లను నల్గొండకు ఆ శాఖ కమిషనర్ బదిలీ చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు 1989 గ్రూప్ 2 బ్యాచ్ కు చెందిన అధికారి. 1992వ సంవత్సరంలో సమాచార పౌర సంబంధాల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా హైదరాబాదులో  తొలి నియామకం. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ గా కూడా హైదరాబాదులోనే పనిచేశారు. ఆ తర్వాత మహబూబ్నగర్ లో ఏపీఆర్ఓగా, డివిజనల్ పిఆర్వో గా  బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత అదే జిల్లాలో కలెక్టర్ గా  బాధ్యతలు నిర్వహించిన జగదీష్ వద్ద పర్సనల్ పిఆర్ఓ గా పనిచేసిన అనుభవం ఉంది. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఏడి వెంకటేశ్వర్లు నవ  తెలంగాణతో మాట్లాడుతూ ప్రజలకు.. ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉంటూ విధులను సక్రమంగా.. సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. కాగా బాధ్యతలు తీసుకునే ముందు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ని ఎడి  మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా నూతన  అధికారిని కలిసి పరిచయం చేసుకున్నారు.
Spread the love