
నవతెలంగాణ – వేములవాడ
పాడి రైతులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సమాధానం చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలో ని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలపై కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని మానుకోవాలని హెతోపలికారు. జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల చర్యలపై ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తే ప్రజల వెంటే ఉంటామని స్పష్టం చేశారు. మంచి పనులు చేస్తే మా వంతు సహకారం అందిస్తాం, అంతేగానీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఎల్లప్పుడూ కొట్లడుతామని, జిల్లా కలెక్టర్ తో పాటు మిగతా అధికారులందరూ ఎవరి కనుసన్నల్లో పని చేస్తున్నారో జిల్లా ప్రజలు గమనించాలన్నారు. కలెక్టర్ అనాలోచిత నిర్ణయం వల్ల 1లక్ష మంది పాడి రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని, మిల్క్ చిల్లింగ్ సెంటర్ మూసివేయడం వల్ల రూ.10లక్షల నష్టం వాటిల్లిందన్నారు. పాడి రైతులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని అన్నారు. పాడి పరిశ్రమ, మిల్క్ కూలింగ్ సెంటర్, సహకార సంఘం అనేది ఏ ఒక్కరి ఆస్తి కాదని, అందరి వుమ్మడి ఆస్తి అని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. జిల్లాల్లో ఎవరి ఆదేశాల మేరకు పాలన కొనసాగుతుందని, అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ వుందా అని అడుగుతున్నామని నిలదీశారు. ఇప్పటివరకు వేములవాడతో జిల్లా వ్యాప్తంగా జరిగిన ఆసుపత్రి మూసివేత, టీ స్టాల్ మూసివేత, పాలకేంద్రం మూసివేత, ఆర్.ఎంపీ క్లినిక్ పై దాడులు కక్ష్య పూరితంగా జరిగినట్లు స్పష్టమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజలకు చక్కటి పాలన అందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులపై ఇప్పటి వరకు ఓపిక పట్టామని, ఇకపై జిల్లా ప్రజలకు మెరుగైన పాలన అందించాలని, లేదంటే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి కొట్లడుతామని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు రుద్రంగి సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం,మాల్యాల దేవయ్య,నిమ్మశెట్టి విజయ్,కోండ కనకయ్య,సిరిగిరి రామచంద్రం,ముద్రకోళ వెంకటేశం,వెంగళ శ్రీకాంత్ గౌడ్,తంపుల సుమన్,మంతెన సంతోష్,గోపు పర్శరాములు,పోతు ఆనీల్ ,పసుల ఆంజీ,మంతె సందీప్,ఉమర్,లింగం రాకేష్,అసద్ తో పాటు తదితరులు ఉన్నారు.