ఊరూరా తెలంగాణ జాతీయ జెండా..

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసూరుల్లాబాద్ బీర్కూర్ బాన్సువాడ మండల ప్రజలు ఆదివారం నిరాడంబరంగా జరుపుతున్నారు. ఊరూరా తెలంగాణ, జాతీయ జెండాలను ఆవిష్కరించారు.అమరవీరుల చిత్ర పటాలకు ఘనంగా నివాళులు అర్పిస్తూ,జాతీయ పథకాన్ని ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నా  ప్రజాప్రతి నిధులు, వివిధ సంఘాల నేతలు. మరి దశ ఉద్యమకారుల ఆధ్వర్యంలో బాన్సువాడ మండలంలోని కోయగుట్ట వద్ద ఉన్న  అమరవీరుల స్తూపం వద్ద జెండా ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణానికి చెందిన చందు మాట్లాడుతూ  సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రత్యేక రాష్ట్రం కోసం  కేసీఆర్, కోదండ రామారెడ్డి , మలిదశ ఉద్యమకారుల సారథ్యంలో సబ్బండ వర్గాలు అలుపెరు గని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైం దన్నారు. అలాగే  అమరుల త్యాగాలు గుర్తు చేసుకున్నారు. వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కొరకు పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీ యమని కొనియాడారు.
Spread the love