Friday, June 12, 2026
E-PAPER
Homeజాతీయంభార‌తీయ నౌక‌ల‌పై దాడులు..యూఎస్ దౌత్య‌వేత్త‌కు స‌మ‌న్లు

భార‌తీయ నౌక‌ల‌పై దాడులు..యూఎస్ దౌత్య‌వేత్త‌కు స‌మ‌న్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: గ‌ల్ఫ్ ప్రాంతంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడులు చేసిన విష‌యం తెలిసిందే. నాలుగు రోజుల వ్యవధిలో భారత సిబ్బంది ఉన్న నౌకలపై మూడు సార్లు దాడులు చేసింది. ఈ వారంలో రెండోసారి అమెరికా దౌత్యవేత్త జసన్ మీక్స్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.ఈ ఘటనపై భారత్, అమెరికా దౌత్యవేత్త జాసన్ మీక్స్‌ను పిలిపించి చర్చించినట్లు తెలుస్తోంది. వరసగా జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అదే విధంగా గల్ఫ్, హార్ముజ్ జలసంధి, సమీప సముద్ర ప్రాంతాల్లో పనిచేస్తున్న దాదాపు 18 వేల మంది భారతీయ సిబ్బందికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DGS) భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -