విద్యా రంగ సమస్యలపై నిర్విరామ పోరాటం చేస్తామని గురువారం యు ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది సూరి అన్నారు. డివిజన్ కమిటీ సమావేశం పట్టణంలోని సివిఆర్ జూనియర్ కళాశాలలో నిర్వహించినారు. 13 మందితో కమిటీని ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎం. జవహర్ సింగ్. సిద్ధాల నాగరాజు ఆఫీస్ బేయార్ గా 5 గురిని ఎన్నుకున్నామన్నారు. ఈ నూతన కమిటీ మాట్లాడుతూ డివిజన్ ప్రాంతంలో నెలకొన్న ప్రభుత్వ విద్యారంగ సంస్థలపై నిరంతరం పోరాటాలు చేస్తూ విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వంపై పోరాడుతుందని అన్నారు. పట్టణంలోని ఎస్టి గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని లేదా ప్రత్యేకమైన పోరాటాలు యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నిర్వహిస్తుందని ఇప్పటికే నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వ విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు గాని యూనిఫామ్స్ అందలేదన్నారు. బుక్స్ అందకుండా విద్యార్థులు ఎలా చదువుకునేది అని తక్షణమే ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మధ్యన భోజనాన్ని అమలుపరచాలని అలాగే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని లేనియెడల యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చవిచూడక తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా అభిషేక్, అరవింద్, సహాయ కార్యదర్శిలుగా విగ్నేష్ నాయక్, సుశీల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.