Sunday, May 24, 2026
E-PAPER
Homeఆటలుఆర్‌ఆర్‌కు కీల‌క పోరు.. వైభ‌వ్ సూర్య‌వంశీ ఔట్

ఆర్‌ఆర్‌కు కీల‌క పోరు.. వైభ‌వ్ సూర్య‌వంశీ ఔట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ క్రికెట్ అభిమానుల‌ను వైభ‌వ్ సూర్య‌వంశీ నిరాశ‌ప‌రిచాడు. వాంఖేడే స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ముంబాయి ఇండియ‌న్స్‌తో కీల‌క పోరులో త‌ల‌ప‌డుతోంది.హోమ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఈక్ర‌మంలోనో ఆర్‌ఆర్ భారీ హిట్ట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ(5) స్వ‌ల్ప స్కోర్‌కే పెవిలియ‌న్ చేరాడు. చాహార్ వేసిన 4 ఓవ‌ర్లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అదే విధంగా మ‌రో ఒపెన‌ర్ జైస్వాల్ కూడా 23 ప‌రుగులే ఔట్ అయ్యాడు. దీంతో ప‌వ‌ర్ల ప్లే ముగిసేరికి ఆర్‌ఆర్ 2 వికెట్లు కోల్పోయి 50 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో జురేల్(11), శ‌న‌క‌(2) ఉన్నారు. స్కోర్:60-3

మ‌రోవైపు ప్లే ఆఫ్ రేసులో స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఈ రెండు జట్లకే కాకుండా, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని ఆశిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వంటి ఇతర జట్ల భవితవ్యాన్ని కూడా నిర్ణయించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -