Homeతెలంగాణ రౌండప్రైతువేదికలో వీబీజీ రాంజీ మండలస్థాయి ఓరియంటేషన్‌

రైతువేదికలో వీబీజీ రాంజీ మండలస్థాయి ఓరియంటేషన్‌

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్‌
మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం వీబీజీరాంజీ మండల స్థాయి ఓరియంటేషన్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్నూర్‌, డోంగ్లీ, జుక్కల మండలాల ఎంపీడీఓ,ఏపీఎం, ఏపీఓ, కార్యదర్శులు హాజరయ్యారు. అదేవిధంగా ముఖ్యఅతిథిగా కామారెడ్డి డీఆర్‌డీఓ దామోదర్ హాజరై మాట్లాడుతూ.. గ్రామాల అవసరాలు, అభివృద్ధి పనులను గుర్తించి, వాటికనుగునంగా గ్రామసభల్లో ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వికసిత్‌ గ్రామాల మోడల్‌ను మ్యాప్‌ ద్వారా జరగాల్సిన అభివృద్ధి పనులను చూపించారు. కార్యక్రమంలో మద్నూర్ ఎంపీడీవో సాయిలు, డోంగ్లి ఎంపీడీవో జగదీష్ కుమార్, జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, మద్నూర్ ఉమ్మడి మండల ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి, మద్నూర్ ఏపీవో పద్మ, ఏపిఎం జగదీష్ కుమార్, జుక్కల్ మండల ఏపీవో ఏపీఎం లతోపాటు వివిధ శాఖల అధికారులు మూడు మండలాలకు చెందిన సర్పంచులు గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -