నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని సుర్బీర్యాల్ గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘము ఆధ్వర్యంలో గత 5 రోజులనుండి శివాజీ బిరుదాంకిత ప్రభాకర్ స్వామి ఆధ్వర్యంలోని లక్ష్మణ్, లింగం వారు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వామి వారి జీవిత చరిత్రని బుర్రకథ రూపంలో నిర్వహించినట్టు సంఘ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు కళ్లకు కట్టినట్టు గా వివరించి స్వామి వారి గురించి వివరించారు. సమాజం లో అంతరించి పోతున్న ఈ కళలలు అవసరం అని సంఘ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.