పార్లమెంట్ సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలి: వెల్టూరి రేణయ్య

నవతెలంగాణ – ఉప్పునుంతల
రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ని గెలిపే లక్ష్యంగా ఈనెల 14వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే పార్లమెంటు సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని యూత్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ జిల్లా అడ్మిన్  ఉపాధ్యక్షుడు వెల్టూరి రేణయ్య పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సమీక్షిస్తున్న సందర్భంలో డాక్టర్ మల్లు రవి ని గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ  ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ ఆభిమానులు,నాయకులు, కార్యకర్త,ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని అనుబంధ సంఘాలు నాయకులు నిస్వార్ధంగా పనిచేసి అత్యధిక మెజార్టీతో డాక్టర్ మల్లు రవిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చాడు.ఇందులో భాగంగాలోనే ఈనెల 14న డా..బి ఆర్.అంబెడ్కర్ 133వ జయంతి పురస్కరించుకుని పార్లమెంట్ సమీక్ష సమావేశం నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఆదివారం ఉదయం10.30 గంటలకు స్థలం:సాయి గార్డెన్ నాగర్ కర్నూల్ లో జరుగుతున్నాదని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, శివసేన రెడ్డి తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు, డా.మల్లు రవి పార్లమెంట్ అభ్యర్థి, చిన్నారెడ్డి ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్,సంపత్ ఏఐసీసీ కార్యదర్శి, డా.వంశీకృష్ణ ఎమ్మెల్యే అచ్చంపేట, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే కల్వకుర్తి, మేఘారెడ్డి  ఎమ్మెల్యే వనపర్తి, రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే నాగర్ కర్నూల్, దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ, సరిత జడ్పీ చైర్మన్ గద్వాల, జగదీశ్వర్ రావు ఇరిగేషన్ చైర్మన్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇంచార్జిలు, సురభి దీవెది, ఖలీద్ హహ్మద్, పార్లమెంట్ ఇంచార్జిలు, మెరుగు రమేష్ రెడ్డి, వంగ భాస్కర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా కమిటీ సభ్యులు హాజరవుతున్నారని, పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గల యువజన కాంగ్రెస్ బాధ్యులు అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్లు మండల అధ్యక్షులు,మండల కమిటీ సభ్యులు,గ్రామ కమిటీ అధ్యక్షుడు, అందరూ ఈ పార్లమెంట్ సమీక్ష సమావేశాని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి మండల అధ్యక్షుడు 50 మందికి తగ్గకుండా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చాడు.
Spread the love